‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్నాడు తరుణ్ భాస్కర్. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్‌గా మారాడు. మలయాళ చిత్రం ‘కప్పెళ’ ను పొగుడుతూ ఈ మధ్య తరుణ్ భాస్కర్ చేసిన పోస్ట్ ఒకటి వివాదానికి దారితీసింది. ‘పిచ్చోడిలా అరవడం.. స్మార్ట్ గా డైలాగ్ చెప్పడం.. స్లో మోషన్ ఫైట్లు.. క్లైమాక్స్ లో మెసేజ్ లు ఇచ్చే హీరోలు ఉండరు. చివరి 10 నిమిషాల్లో రైతుల గురించో.. సైనికుల గురించో.. ఇండియా గురించో సందేశాలు ఉండవు. కానీ దీన్ని కూడా ఆ ఊరిలో సినిమా అంటారు మరి’ అంటూ తరుణ్ పోస్ట్ పెట్టారు.
అయితే దీనికి హీరోల ఫ్యాన్ గ్రూపుల్లో ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. మన హీరోలను తక్కువ చేసి తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడుతున్నారు. అయితే ట్రోల్ చేసే వారిపై కూడా తరుణ్ భాస్కర్ తనదైన స్టైల్ లో కామెంట్ చేవాడు. నకిలీ ఐడి లతో దాక్కొని మొరిగే కుక్కలు అంటూ.. ఆత్మాభిమానం లేదా? అంటూ తరుణ్ భాస్కర్ రెచ్చగొట్టడంతో ఫ్యాన్స్ కౌంటర్లు పెంచేశారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో.. చూడాలి.