టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు. సోమవారం దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి మాలిని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో వంశీ తన నివాసంలో పార్టీ ఏర్పాటుచేశారు. వేడుకకు మహేశ్ కుటుంబాన్ని, తారక్ కుటుంబాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి దిగిన ఫొటోను మహేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘పార్టీలో బాగా సందడి చేశాం. హ్యాపీ బర్త్‌డే మాలిని’ అని క్యాప్షన్ ఇచ్చారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ‘మహర్షి’ చిత్రంలో మహేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఉగాది సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అతి తక్కువ సమయంలోనే అత్యధిక మంది రీట్వీట్ చేసిన, లైక్ చేసిన టీజర్‌గా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్‌లో వేగంగా 10 మిలియన్ల వ్యూస్ నుంచి 12 మిలియన్ల వ్యూస్‌కు చేరిన టీజర్‌గానూ రికార్డు సృష్టించింది. మే 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క తారక్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.