నేడు ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26 వ వర్ధంతి కావడంతో అభిమానులు సహా ఆయన కుటుంబీకులు మరోసారి ఆయన పేరు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. నందమూరి రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు.
అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారని, తెలుగుజాతి ఉన్నంతవరకు ఆయనను మరచిపోలేరని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.
ఇక తాత ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకుని పుట్టిన జూ. ఎన్టీఆర్ కూడా ఆయనలానే స్టార్ గా ఎదిగి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక నేడు తాత వర్ధంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశాడు. ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ .. ‘తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక తారక్ తో పారు మరో మనవడు, హీరో కళ్యాణ్ రామ్ సైతం తాతను గుర్తుచేసుకొని ట్వీట్ చేశారు.
తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే 🙏🏻 pic.twitter.com/msOmHdOtvl
— Jr NTR (@tarak9999) January 18, 2022
జోహార్ NTR 🙏🏽🙏🏽 pic.twitter.com/VsnBBbyfU9
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 18, 2022