టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో సక్సెస్ సాధించిన నటి తాప్సీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తయింది. ఇన్నాళ్లూ నటిగా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకుంది. అదేమిటంటే తాను ఇప్పుడు నిర్మాతగా మారబోతుంది. ఔట్సైడర్ ఫిల్మ్ పేరుతో ప్రొడక్షన్స్ హౌస్ స్టార్ట్ చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది తాప్సీ. నా జీవితంలో ఇదొక కొత్త అనుభవం. కచ్చితంగా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా.. ఇప్పుడు నా కల నెరవేరింది. ఈ ప్రయాణంోల ఎలా నెగ్గుకు రావాలో నేర్చుకున్నా. పబ్లిక్ ఫిగర్ అవుతానని ఊహించలేదు. నాపై ప్రేమాభిమానం చూపించిన అందరికీ రుణపడి ఉంటాను, నా స్నేహితుడు ప్రాంజల్తో కలిసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టా. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తన ప్రొడక్షన్ హౌస్ గురించి ప్రకటించింది. నిర్మాతగా తన తొలి చిత్రం జీ స్టూడియోతో కలిసి ‘బ్లర్’ నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి అజయ్ బాల్ దర్శకుడు.