HomeTelugu Trending'మరో ప్రస్థానం' మూవీ టీమ్ తో తనీష్ బర్త్ డే సెలబ్రేషన్స్

‘మరో ప్రస్థానం’ మూవీ టీమ్ తో తనీష్ బర్త్ డే సెలబ్రేషన్స్

Tanish birthday

నేడు టాలీవుడ్‌ యంగ్ హీరో తనీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న’మరో ప్రస్థానం’ సినిమా టీమ్ పుట్టినరోజు వేడుకలు జరిపింది. సినిమా కార్యాలయంలో యూనిట్ సభ్యుల సమక్షంలో తనీష్ కేక్ కట్ చేశారు. హీరో తనీష్ కు దర్శకుడు జాని, ఇతర చిత్ర బృందం బర్త్ డే విశెస్ తెలిపి కేక్ తినిపించారు. ‘మరో ప్రస్థానం’ చిత్రంతో పాటు తనీష్ రాబోయో సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్నారు.

తనీష్ బర్త్ డే స్పెషల్ గా “మరో ప్రస్థానం” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘మరో ప్రస్థానం’ సినిమా అతి త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో ఎమోషనల్ కిల్లర్ పాత్రలో నటించారు తనీష్. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేథీ, భాను శ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu