టాలీవుడ్‌లో గత రెండు రోజులుగా బాలకృష్ణ, నాగబాబు వివాదం నడుస్తూనే ఉంది. ఇండస్ట్రీపై బాలయ్య చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా నాగబాబు కూడా సెటైర్లు వేసాడు. అయితే ఈ ఇద్దరిపై కూడా కొందరు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అలా మాట్లాడితే ఇక పెద్దోళ్లుండి ఏం లాభం అంటూ కొందరు నాగబాబు, బాలయ్యపై మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే దాసరి వర్ధంతి వేడుకలలో భాగంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందులో బాలకృష్ణ, నాగబాబు వివాదం కూడా ఉంది. ఈ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలను తమ్మారెడ్డి ఖండిస్తున్నట్లు తెలిపాడు.
దాసరి ఉన్నపుడు ఈయన ఇంట్లో ఎన్నోసార్లు మీటింగ్స్ జరిగాయి. అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. మరిప్పుడు ఎందుకు చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగితే ఉలిక్కిపడుతున్నారనేది అర్థం కావడం లేదన్నాడు భరద్వాజ్. చిరంజీవి ఏమైనా స్వలాభం కోసం పెట్టాడా లేదు కదా.. ఆయన కూడా ఇండస్ట్రీ కోసమే పెట్టాడు.. మరి అలాంటప్పుడు బాలకృష్ణ అనని మాటల్ని కూడా అన్నారని చూపిస్తున్నారు.. ఆయన వ్యక్తిగతంగా అన్న మాటలపై తాను స్పందించను కానీ.. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ చాలా స్నేహంగా ఉన్నారు. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ మాట్లాడాము.. ఈ సమస్యకు అక్కడే పరిష్కారం దొరికిందని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు ఈయన. ఇండస్ట్రీకి మంచి జరుగుతుందనుకుంటే చిరంజీవే కాదు ఎవ్వరితోనైనా కలసి నడవడానికి అంతా సిద్ధంగానే ఉన్నారని తమ్మారెడ్డి అన్నారు .