తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ జులై 30న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధ్యక్ష పదవి కోసం దిల్‌రాజు, సి.కల్యాణ్ పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్న తీరును చూసి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికల వాతావరణం చూస్తుంటే భయమేస్తోందని భరద్వాజ అన్నారు. చాంబర్ ఎదిగిందని సంతోషపడాలో, సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం ఆవేదన వ్యక్తం చేశారు.
సభ్యులు దేనికి పోటీపడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను కూడా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని, చాలా ఎన్నికలను చూశాను గానీ, ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.