ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా.. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సుదీర్ఘకాలం పాటు గవర్నర్‌గా పనిచేసి.. కొద్ది నెలల క్రితం తెలంగాణకే గవర్నర్ నరసింహన్‌ను పరిమితం చేసిన కేంద్రం.. ఇప్పుడు ఆయన బదిలీ చేసింది. ఇక, ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించింది. సౌందర్ రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించింది కేంద్రం. దీనినికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. ఇక, తమిళిసై సాయి సౌందర్ రాజన్‌ను బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది… వృత్తిరిత్యా ఆమె వైద్యురాలు. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జన్మనించారామె.. బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లుగా ఎంపీగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయితే, బీజేపీలో ఆమె సేవలను కీలకంగా అందించారు. దీంతో.. ఆమెను గవర్నర్ పదవి వరించింది.