మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ ఇటీవల.. ‘గద్దలకొండ గణేశ్’గా పలకరించాడు. ప్రస్తుతం తన పదో సినిమాకి సన్నద్ధమవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వరుణ్ తల్లిదండ్రులుగా రమ్యకృష్ణ, మాధవన్ నటించబోతున్నారని సమాచారం. అంతేకాదు ఈ రెండు పాత్రలకి సినిమాలో ఎంతో ప్రాధాన్యముంటుందని తెలిసింది. త్వరలోనే వీరిద్దరి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా ఇదివరకు వరుణ్ తండ్రి నాగబాబుకి జోడీగా నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు వరుణ్‌కి తల్లిగా నటించనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
కిరణ్ కొర్రపాటి సినిమా కోసం బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట వరుణ్. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణ విషయంలో కాస్త జాప్యం జరుగుతోందని సమాచారం. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ‘తమ్ముడు’ చిత్రం కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే బాక్సర్‌గా అదరగొట్టాడో.. అదే మ్యాజిక్‌ని రిపీట్ చేసే దిశగా వరుణ్ కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. మరి పవన్ తరహాలో వరుణ్ కూడా బాక్సింగ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.