Tamil Star Director Atlee:
అట్లీ కుమార్ జవాన్ తో బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించి, భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్‌గా నిలిచారు. షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్లు వసూలు చేసి, అట్లీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
View this post on Instagram
ఈ విజయం తరువాత అట్లీ, తన మొదటి హిందీ ప్రొడక్షన్ గా బేబీ జాన్ చిత్రాన్ని తీసుకువచ్చారు. ఇది ఆయన తమిళ సూపర్‌హిట్ థెరి కి హిందీ రీమేక్‌గా రూపొందించారు. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, క్రిస్మస్ 2024 న విడుదలైంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంతో కీర్తి సురేష్ హిందీ సినిమాల్లోకి అడుగు పెట్టారు. థమన్ సంగీతం, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ వంటి ప్రత్యేకతలతో ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే, సినిమా భారీ అంచనాలు నెరవేరలేదు. మొదటి రోజున రూ. 11.25 కోట్లు మాత్రమే వసూలు చేసి, నాలుగు రోజుల్లో రూ. 28.65 కోట్లకే పరిమితమైంది. రూ. 160 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జీవితకాల వసూళ్లు రూ. 50-60 కోట్ల మధ్యలోనే ఉండొచ్చని అంచనా. కథలో భావోద్వేగాలు సరిగా చూపించలేదు అని అభిమానులు, విమర్శకులు పేర్కొన్నారు.
ALSO READ: CBN vs Revanth Reddy: ఎవరు ఎందులో ఎక్కువో తెలుసా?