ప్రముఖ కోలీవుడ్ సింగర్ మాణిక్య వినాయగం(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆదివారం నాడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తమిళ సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు.
వినాయగం.. తమిళ దిల్ సినిమాలోని ‘కన్నుక్కుల గెలతి’ అనే పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ఆరంభించారు. ‘తిరుద తిరుది’ అనే సినిమాలో ధనుష్ తండ్రిగా నటించారు. నటనలో కూడా ప్రవేశం ఉన్నప్పటికీ పాటంటేనే ఆయనకు మక్కువ ఎక్కువ. అలా వినయగం అన్ని భాషల్లో కలుపుకుని ఇంచుమించు 800 పాటలు పాడారు. ఇవే కాకుండా ఆయన జానపదాలు, భక్తి పాటలు మరో 1000 దాకా ఆలపించారు. తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో పట్టు పట్టు చెయ్యే పట్టు సాంగ్ పాడి అలరించారు.