కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్, అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, నాని సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది. నాని హీరోగా శివ నిర్వాణ ఒక సినిమాను రూపొందించనున్నాడు. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.
విభిన్నమైన కథాకథనాలతో రూపొందే ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా ‘రీతూ వర్మ’ను తీసుకున్నట్టు సమాచారం. ఇక మరో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాని మరదలిగా.. సెకండ్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుందని అంటున్నారు. తమిళంలో మాదిరిగానే తెలుగులోను ఐశ్వర్య రాజేశ్ స్పీడ్ పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.