డైరెక్టర్ పీఎస్ వినోద్ రాజ్ తెరకెక్కించిన తమిళ చిత్రం కూజంగల్(గులకరాళ్లు). ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌లో(ఐఎఫ్ఆర్ఆర్) భాగంగా కూజంగల్ ‘టైగర్ అవార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని పొందిన తొలి తమిళ చిత్రం ఇదే. దీనిని కోలీవుడ్ కపుల్ నయనతార విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్‌లోని ఐఎఫ్‌ఎఫ్‌ఆర్ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో కలిసి కూజంగల్ స్క్రీనింగ్‌లో విఘ్నేష్, నయనతార సందడి చేశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూజంగల్ చిత్రాన్ని గురువారం రోటర్‌డామ్ ఉత్సవంలో ప్రదర్శించారు. కాగా టైగర్ అవార్డును గెలుచుకున్న రెండవ భారతీయ చిత్రం కూజంగల్. మొదట 2017లో సనల్ కుమార్ ససిధరన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం సెక్సీ దుర్గా ఈ అవార్డును గెలుచుకుంది. కాగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్‌డామ్ విభిన్న ప్రయోగాతక చిత్రాలను గుర్తించడంలో ప్రసిద్ధి చెందింది. వినోద్ రాజ్‌కు దర్శకుడిగా కూజంగల్ మొదటి చిత్రం. తమ సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన దర్శకుడు వినోద్ రాజ్ మా కష్టానికి ఫలితం దక్కింది అని పేర్కొన్నారు.