HomeTelugu Big Stories'విరాటపర్వం'పై తమిళ డైరెక్టర్‌ ప్రశంసలు

‘విరాటపర్వం’పై తమిళ డైరెక్టర్‌ ప్రశంసలు

Tamil director pa ranjith p

దగ్గుబాటి రానా, హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ చిత్రం జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది.

రానా కామ్రేడ్‌ రవన్న పాత్ర పోషించగా.. సాయి పల్లవి ప్రాధానలో కనిపించింది. ఇక ప్రియమణి, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో రానా, సాయి పల్లవిల నటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవి, వెంకటేశ్‌ వంటి స్టార్‌ హీరోలు ఈ మూవీని కొనియాడారు. తాజాగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ సైతం విరాట పర్వం మూవీపై స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ డైరెక్టర్‌ పా రంజిత్‌ సోషల్‌ మీడియా వేదికగా విరాట పర్వం మూవీపై ప్రశంసలు కురిపించాడు.

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్‌ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక సాయి పల్లవి అయితే చాలా అద్భుతంగా నటించింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన మూవీ టీమ్‌కు స్పెషల్‌ థ్యాంక్స్‌’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, విరాట పర్వం చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్లో సుధాకర్‌ చెరుకూరి, సురేశ్‌ బాబులు సంయుక్తంగా నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu