ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను ‘మణికర్ణిక’ వివాదం కుదిపేస్తుంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు తరువాత కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో వివాదం మొదలైంది. కంగనా తన పాత్రను ఎలివేట్ చేసుకునేందుకు ఇతర పాత్రలను తగ్గించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో కొంతమంది క్రిష్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు కంగనానే కరెక్ట్ అంటున్నారు.
తాజాగా ఈ వివాదంపై మిల్కీబ్యూటీ తమన్నా స్పందించారు. ‘నటనపరంగా కంగనాకు వంక పెట్టడానికి లేదు. ఆమె ఎంత గొప్ప నటో అందరికీ తెలిసి విషయమే. క్రియేటివ్ పీపుల్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా ఫైనల్‌గా అవి సినిమాకు మంచి చేసేవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరు సినిమా సక్సెస్ కోసమే పనిచేయా’లన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పన్న విషయాన్ని సూటిగా చెప్పేందుకు తమన్నా ఇష్టపడలేదు.