మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆమె అంగీకరించడం లేదని చెపుతున్నారు. మరోవైపు ఈ ప్రచారాన్ని ఇంతవరకు తమన్నా ఖండించలేదు. దీంతో, పెళ్లి వార్త నిజమేనని నెటిజెన్లు ఒక క్లారిటీకి వస్తున్నారు. దీంతో త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం తమన్నా చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు, ఓ తమిళ చిత్రాన్ని కూడా చేస్తోంది.