HomeTelugu Trendingమహేష్‌బాబు సినిమాలో స్ఫెషల్‌ సాంగ్‌లో తమన్నా!

మహేష్‌బాబు సినిమాలో స్ఫెషల్‌ సాంగ్‌లో తమన్నా!

5 7సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని ఒక పాటలో మహేష్‌తో అడిపాడేందుకు తమన్నా మెరవనుందనేది తాజా సమాచారం.

అయితే ఇది ఐటమ్ సాంగ్ కానీ .. స్పెషల్ సాంగ్ గాని కాదట. మహేష్‌ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్‌ బాబు పాత్ర రీత్యా ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయకుండా హుందాగా వ్యవహరించవలసి ఉంటుంది. అందువలన ఆయన హుందా తనాన్ని కాపాడుతూ, ఆ పాటలో తమన్నా వయ్యారాలు ఒలకబోస్తూ స్టెప్స్ వేసేలా ప్లాన్ చేశారట. ఇందుకుగాను తమన్నాకి పారితోషికంగా భారీమొత్తమే అందుకుంటుంది అని అంటున్నారు. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu