HomeTelugu Trendingతమన్నా ట్వీట్.. నెటిజన్ల విమర్మలు

తమన్నా ట్వీట్.. నెటిజన్ల విమర్మలు

4 5
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ మృతికి శ్వేత జాతి పోలీసు కారణమైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్‌ తమన్నా ఆ విషయం పై స్పందిస్తూ.. “నీ మౌనం నిన్ను కాపాడదు. మనిషి అయినా జంతువైనా ప్రతి ఒక్కరి జీవితం ముఖ్యమే కదా? మనిషి మనిషిగా ప్రేమ, జాలి, కరుణతో జీవించడం మళ్లీ నేర్చుకోవాలి” అంటూ తమన్నా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో తమన్నా తన ముకానికి నలుపురంగు పూసుకున్న ఓ ఫోటోను కూడా పోస్ట్ చేసింది.

అయితే ఇప్పుడు తమన్నా చేసిన ఈట్వీట్ ఆమెపై విమర్శలకు దారి తీసింది. దీనికి కారణం తమన్నా గతంలో ఓ బ్యూటీ క్రీం యాడ్‌లో తెల్లగా అవ్వాలంటే పలానా బ్యూటీ క్రీం వాడాలని చెప్పడమే. తమన్నా పోస్ట్ చుసిన నెటిజన్లు ‘నువ్వు నల్లజాతిపై అహంకారం వద్దని చెబుతున్నావా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖం తెల్లగా మెరవాలంటే క్రీం లు వాడాలి అని సూచించిన నువ్వు ఎలా చెబుతున్నావు అంటూ తమన్నాపై విమర్శలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu