మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సారి దేవతగా కనిపించబోతుంది. తాజాగా నల్ల చీర, బ్లౌజ్‌లో నెత్తిన కిరీటం పెట్టుకుని, మెడలో ఆభరణాలు వేసుకుని అరటాకులో భోజనం చేస్తూ కనిపించింది. తమన్నా సోఫాలో కూర్చొని అరటాకులో ఇడ్లీ, వడ, దోస ఆరగిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఎఫ్ 3 సినిమా కోసం ఇలా మారిపోయింది తమన్నా. తన భర్త వెంకటేశ్ చేజింగ్ చేసే పరాశక్తిగా కనిపించనుందట.
సినిమాలో వచ్చే చిన్న కామెడీ సన్నివేశం కోసం మరో హీరోయిన్ మెహరీన్ కూడా ఇలాంటి గెటప్‌లోనే కనిపించనుందని టాలీవుడ్ టాక్. తమన్నా పోస్ట్ చేసిన తాజా స్టిల్‌పై ఫ్యాషన్ డిజైనర్ నిషికా లుల్లా, హీరోయిన్లు సమంత, ఈషా గుప్తా కామెంట్ల వర్షం కురిపించారు.