
Tamannaah favourite chaat spot:
తెలుగు సెలబ్రిటీలకు ఫుడ్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో మన అందరికీ తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ ఫుడ్ అంటే వాళ్లకు ప్రాణం. ఇక బిర్యానీ, హలీం, టిఫిన్స్… ఇవన్నీ స్టార్ల ఫేవరెట్ లిస్టులో టాప్‌లో ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్టులో చేరిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా!
తమన్నా ఇటీవల ఓడెలా 2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చాయ్ బిస్కెట్ ఫుడ్ టీమ్‌తో కలిసి మధాపూర్‌లోని నైనతార రెస్టారెంట్‌కి వెళ్లింది. మేకప్ లేకుండా చాలా సింపుల్‌గా, చిరునవ్వుతో కనిపించిన తమన్నా, అక్కడి చాట్‌ను ఆస్వాదించింది. “నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా స్వీట్ ఐటమ్స్. హైదరాబాద్ ఫుడ్ అంటే ఇంకాస్త ప్రత్యేకం,” అంటూ చెప్పారు.
తమన్నా స్పెషల్ కాంబో ఏంటంటే… డోసా + పవ్ భాజీ! షాక్ అయిపోయారా? bread తినలేను కాబట్టి, ఇంట్లో నేను పవ్ భాజీని డోసాతో తింటా అంటున్నారు తమన్నా. ఇది తన ఇంట్లో గెస్టులు వచ్చినప్పుడల్లా రెడీగా ఉండే స్పెషల్ ఐటెం అట.
ఆమెను అడిగితే, “నీవు ఎప్పటికీ తినగలిగే ఒకే ఒక్క డిష్ ఏంటి?” అన్న ప్రశ్నకు తమన్నా సమాధానం – బిర్యానీ! “ఎటువంటి బిర్యానైనా కుదిరుతుంది, కానీ హైదరాబాద్ బిర్యానీ అయితే… ఆహా అదొక లెవెల్!” అంటూ తన ఫుడ్ లవ్‌ను షేర్ చేసుకున్నారు.
ప్రొఫెషనల్ గానే చూసుకుంటే, తమన్నా నటించిన ఓడెలా 2 అనే సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ సినిమా ఏప్రిల్ 17, 2025 న విడుదల కానుంది.