మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం తమన్నా డబ్బింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మెహర్ రమేశ్ ఈ మేరకు అప్ డేట్ ఇచ్చారు. మా మిల్కీ బ్యూటీ తమన్నా భోళాశంకర్ కోసం డబ్బింగ్ చెప్పడం పూర్తయింది అని వెల్లడించారు.
ఈ చిత్రంలో చిరంజీవితో తమన్నా సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయని, తమన్నా గ్లామరస్ గా మెరిసిపోయిందని వివరించారు. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, బ్రహ్మానందం, హైపర్ ఆది తదితరులు నటించిన భోళాశంకర్ తో నవ్వుల విందు ఖాయమని మెహర్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.
ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్టేట్స్ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇక తాజా గా విడుదలైన ‘మిల్కీ బ్యూటీ’ పాటకు విశేష స్పందన లభిస్తోంది.