కరోనా కారణంగా ఎప్పుడు బిజీగా ఉండే సెలబ్రిటీలకు ఫ్రీ టైం దొరికింది. ఎవరికి వారు ఇంట్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎవరి టెన్షన్ లో వాళ్లు ఉంటే ఏ టెన్షన్ లేకుండా మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఇలా కొండకోనల్లో షికార్లకు చేస్తోంది. ప్రకృతిని ఆస్వాదించే పనిలో పడింది.. మహారాష్ట్రలోని థానేలో ఉన్న ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్లేస్ అసంగావ్ మహులి కోటను మిల్కీ ఇటీవల సహచరులతో కలిసి సందర్శించిందట. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ట్రెక్కింగ్ ఫోటోని షేర్ చేసింది. ‘ప్రకృతి ఒడిలోకి వెళ్లిపోండి..మిమ్మల్ని మీరు గుర్తిస్తారు’ అంటూ ఆసక్తికర కొటేషన్ టాగ్ చేసింది ఈ ఫోటోకి. మరీ ఈ బ్యూటీతో పాటు వచ్చిన ఆ సహచరుడు ఎవరు అన్నది రివీల్ చేయలేదు. కేవలం తమన్నా మాత్రమే కాదు. ఇటీవల ఈ తార ముంబైలో వర్షపు జల్లులను ఎంజాయ్ చేస్తూ..ఎక్సర్సైజ్ చేసిన ఫొటో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.