HomeTelugu Big Storiesఆ నటుడి ప్రేమలో తమన్నా!

ఆ నటుడి ప్రేమలో తమన్నా!

Tamannaah bhatia love with
హీరోయిన్ తమన్నా భాటియా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ చేస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కొత్త ఏడాదిని గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ముద్దు పెడుతున్నట్టుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.

విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. 2017లో నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’లో విలన్ గా నటించాడు. తమన్నా భాటియా, విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్ సెట్స్‌లో తొలిసారి కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. డిసెంబర్ 21న తమన్నా పుట్టిన రోజున విజయ్.. తమన్నా నివాసంలో కనిపించాడు. ఆ తర్వాత పలు ఈవెంట్లకు వీరు జంటగా కలిసి వెళ్లారు. దీనిపై తమన్నా స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu