ఈతరం హీరోయిన్లు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఓపక్క సినిమాలు చేస్తూ… మరోపక్క కమర్షియల్స్ చేస్తూ ఎడాపెడా సంపాదిస్తూన్నారు. కొత్త హీరోయిన్లు వస్తుంటే పాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతుంటాయి. దీనిని గుర్తెరిగే ఆయా తారలు అటువంటి పరిస్థితిలో ఎటువంటి అవకాశాలు వచ్చినా ఒప్పేసుకుంటూ వుంటారు. తాజాగా హీరోయిన్ తమన్నా కూడా అదే స్టైల్లో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే తాజాగా డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫాం నుంచి తమన్నాకి ఓ ఆఫర్ వచ్చిందట. ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ కొట్టేసిందట. డీల్ బాగుండడంతో తమన్నా వెంటనే దీనికి ఓకే చెప్పేసిందని అంటున్నారు.