మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య కుచ్ కుచ్ కహాని నడుస్తోంది అంటూ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఆ కుచ్ కుచ్ కహాని వ్యవహారం గురించి తమన్నా సన్నిహితులు ముసిముసి నవ్వులు రువ్వుతూ.. ఈ ఘాటు ప్రేమ నిజమే అన్నట్టు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు. దాంతో ఈ తమన్నా – విజయ్ వర్మ ఎఫైర్ సంగతి అందరికీ తెలిసిపోయింది. అయితే, విజయ్ వర్మ పై తన ప్రేమ విషయంలో తమన్నా మళ్లీ లేటెస్ట్ రియాక్ట్ అయింది. ఈ క్రమంలో తమన్నా చాలా విషయాలే చెప్పుకొచ్చింది.
మరి ఆ ముచ్చట్లు ఏమిటో.. తమన్నా మాటల్లోనే విందాం. ‘మా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఆ మధ్య పుకార్లు చెలరేగాయి. నేను వెంటనే వాటిని ఖండించాను. అయినా ఎందుకు ఇంకా వాటినే పట్టుకుని వేలాడుతున్నారు ?, అసలు మా మధ్య ఏముంది ? ఏమీ లేదు. అయినా, విజయ్ వర్మ, నేను కలిసి కనిపిస్తే, కలిసి నటిస్తే లవర్స్ అయిపోతామా ?, అసలు మీడియా అలా వార్తలు రాయొచ్చా ? అంటూ తమన్నా తెగ లాజిక్ లు మాట్లాడేస్తోంది. విజయ్ వర్మ తో తమన్నా ప్రేమలో ఉంది అంటూ ఇప్పటికే ఎన్నో రకాలుగా రుజువు అయ్యింది.
ఈ క్రమంలోనే తమన్నా పై విధంగా మాట్లాడింది. ఐతే, ఇలాంటి మాటలు అన్నీ రొటీన్ అయిపోయాయి. జనం మారిపోయారు. అయినా తమన్నా మాత్రం అలాగే మాట్లాడుతోంది. విజయ్ వర్మ తో తమన్నా డేటింగ్ లో ఉందని మీడియా వార్తలు రాస్తుంది అంటే..? దానికి కారణం ఎవరై ఉంటారు. కచ్చితంగా విజయ్ వర్మ – తమన్నానే కదా. ఆ మధ్య జనవరి ఫస్ట్ కి జరిగిన ఓ పార్టీలో విజయ్ వర్మతో తమన్నా ఎంత క్లోజ్ గా ఉందో తెలిసిందే కదా. సరే క్లోజ్ గా ఉంటే లవర్ అయిపోతుందా ?, కచ్చితంగా కాదు. కానీ, విజయ్ వర్మకి తమన్నా ఒక లవర్ లా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి ?
మీడియా ఏదో వార్తలు రాస్తోంది అని తమన్నా ఇప్పుడు కొత్తగా కస్సుబుస్సులాడుతోంది గానీ, ఈ వార్తలు ఆమెకు కూడా ఇష్టమే అంటున్నారు. కానీ, మరోవైపు మాత్రం తమన్నా ఇదంతా ఉత్తిదే అంటుంది. ఓ హిందీ టాక్ షోకి వెళ్ళినప్పుడు తమన్నాకి విజయ్ వర్మతో మేటర్ ఏంటనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు కూడా తమన్నా ఇన్ డైరెక్ట్ గా ఏదో ఉంది అనే కోణంలోనే మాట్లాడింది. కానీ పైకి మాత్రం ఏమీ లేదు అంటూ కహానీలు చెబుతుంది.
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు