సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి స్టార్‌డమ్‌తో పాటు డబ్బు బాగా సంపాదించాక ఇక్కడివారిపై విమర్శలు చేస్తుంటారు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు తమన్నా కూడా చేరింది.
ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది తమన్నా. కేవలం తెలుగులోనే కాదు తమిళంలోనూ నిమాలు చేస్తోంది. తెలుగు లో
దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. దక్షిణాది, బాలీవుడ్‌లోనూ, వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
కొంతకాలంగా ఆఫర్లు లేక ఇబ్బంది పడ్డ తమన్నాకు ఇప్పుడు బాలీవుడ్‌లో ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ తమన్నా బిజీగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే ఆశతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తాను ఎంతగానో శ్రమిస్తున్నానని చెప్పింది.
సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువ అని, అందువల్లనే తాను కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తోందని తమన్నా విమర్శలు గుప్పించింది. సౌత్ సినిమాల్లో హీరోయిజమే ఎక్కువగా ఉంటుందని, హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదని తమన్నా అంటోంది. పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయని విమర్శించింది. అందుకే అలాంటి సినిమాల్లో నటించకూడదనే కొన్ని ఆఫర్లను వదులుకున్నానని తమన్నా ఆరోపణలు చేసింది.
ముఖ్యంగా కొన్ని కమర్షియల్ సినిమాల్లో తన పాత్రకు ఇబ్బంది లేకుండా హీరోయిజం తీవ్రతను తగ్గించమని దర్శకులను కోరిన సందర్భాలు ఉన్నట్లు తెలిపింది. రాను రాను ఇలాంటి సన్నివేశాలు చేయడం మానేశా. అలాంటి సినిమాలకూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అంది తమన్నా.