HomeTelugu Big Storiesఆస్పత్రి నుంచి తమన్నా డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి తమన్నా డిశ్చార్జ్

Tamanna discharged from hos

టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత వారం తలనొప్పి, బాడీ పెయిన్స్‌, స్వల్పంగా జ్వరం రావడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు తమన్నా తెలిపింది. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందిన తమన్నా సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు ప్రకటించారు. సెట్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు కరోనా బారినపడినట్లు తమన్నా వెల్లడించింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తమన్నా ప్రకటించింది. త్వరలోనే మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అవుతానని ధీమా వ్యక్తం చేసింది. వైద్యుల సూచన మేరకు కొద్దిరోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంటున్నట్లు తెలిపింది. తనను ఆదరిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపింది. తమన్నా తల్లిదండ్రులు కూడా ఆమెతోనే ఉన్నారు. ఇటీవల తమన్నా తల్లిదండ్రులు కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu