స్టార్ హీరోయిన్.. దీపికా పదుకొణె మాలీవుడ్ భామ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సవాలు విసిరారు. ఇలా కన్నుగీటి అలా నేషనల్ సెన్సేషన్‌గా మారారు ప్రియా వారియర్. ఆమె కన్ను గీటుతూ ఉన్న ‘ఒరు అడార్ లవ్’ సినిమా పాటలోని సన్నివేశం గత ఏడాది ప్రేమికుల రోజున ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సీన్ ప్రియా వారియర్‌కు రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడి వెళ్లినా కన్నుగీటి చూపించమని అడిగేవారు. అంతేకాదు సినీ స్టార్స్ కూడా ఆమె చూపునకు ఫిదా అయ్యారు.
‘ఛపాక్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో భాగంగా ఆమె తన స్టైల్లో కన్నుగీటారు. ‘దీన్ని స్వీకరించు ప్రియా ప్రకాశ్ వారియర్’ అంటూ సవాలు చేశారు. దీన్ని చూసిన ప్రియా వారియర్ స్పందించారు. ‘దేవత కన్నుగీటిందా..?
మీ కంటే బాగా చేయడం కష్టం’ అని కామెంట్ చేశారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘ఛపాక్’. మేఘనా గుల్జార్ దర్శకురాలు. జనవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.