స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నది. టబు పాత్రకు సంబంధించిన ఫోటోను ఇటీవలే రిలీజ్ చేశారు. ఇందులో టబు అల్లు అర్జున్ అక్కగా నటిస్తున్నట్టు సమాచారం.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఓ హైక్లాస్ ఇంటికి టబు వెళ్తుంది. అలా ఆ ఇంటికి వెళ్లిన టబుకు ఎదురైన సంగటనలు ఏంటి.. వాటిని బన్నీ ఎలా పరిష్కరించాడు అన్నది కథ అని తెలుస్తోంది. అక్క సెంటిమెంట్ తో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.