ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఆయన నిర్మించిన ‘కిక్ 2′,’ఇజం’ చిత్రాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. దాంతో ఆర్థికంగా కల్యాణ్ రామ్ చతికిలపడ్డాడు. ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎన్టీఆర్ హీరోగా ‘జైలవకుశ’ సినిమాను మొదలుపెట్టాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా 80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ కారణంగా జైలవకుశ ఇంకా నిర్మాణంలో ఉండగానే.. థియేట్రికల్ రైట్స్ ను, శాటిలైట్ రైట్స్ ను కలుపుకొని మొత్తం 80 కోట్లకు విక్రయించడానికి రెడీ అవుతున్నారు. అంటే 30 కోట్ల వరకు సినిమాకు లాభాలు వస్తాయి. ఈ సినిమాతో నష్టాల్లో ఉన్న కల్యాణ్ రామ్ కొంతవరకు అయినా.. బయటపడే అవకాశాలు ఉన్నాయి.