Taapsee Pannu Wedding: స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల సీక్రెట్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు మథియాస్ బోయ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి వివాహం విషయం బయటికి రాకుండా సైలెంట్‌గా చేసుకున్నారు. తాప్సీ, బోయ్ పెళ్లి ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో మార్చి 23వ తేదీన జరిగిందని సమాచారం. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ విషయం వచ్చింది.
కావాలనే ఈ వివాహం గురించి బయటికి తెలియకుండా తాప్సీ, బోయ్ జాగ్రత్త పడ్డారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు బాలీవుడ్ సెలెబ్రెటీలు హాజరయ్యారని తెలుస్తోంది. మార్చి 20వ తేదీన వీరి ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్ మొదలయ్యాయని సమాచారం బయటికి వచ్చింది. హల్దీ, సంగీత్ లాంటి ఫంక్షన్ల తర్వాత మార్చి 23వ తేదీన వివాహ వేడుక జరిగిందని తెలిసింది. ఇప్పటి వరకూ కూడా ఎలాంటి ఫొటోలు, వీడియోలను బయటకు రానివ్వలేదు.
తాజాగా వీరి పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాప్సీ పన్ను – మథియాస్ బోయ్ పెళ్లి వీడియో ఆకట్టుకునేలా ఉంది. రెడ్ కలర్ డ్రెస్.. బంగారు ఆభరణాలను పెళ్లికి ధరించారు తాప్సీ. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుండగా.. డ్యాన్స్ చేస్తూ ఆమె పెళ్లి వేదికకు నడుచుకుంటూ వచ్చారు. మండపంపైకి రాగానే మథియాస్ బోయ్ను కౌగిలించుకున్నారు.
వేదికపైకి వచ్చాక తాప్సీ పన్ను, మథియాస్ బోయ్ దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత అతిథులు వారిపై పూల వర్షం కురిపించారు. తాప్సికి బోయ్ ముద్దుపెట్టారు. అనంతం వేదికపైనే ఆనందంతో జంటగా డ్యాన్స్ చేశారు. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ మథియాస్ బోయ్.. ఈ పెళ్లిలో సంప్రదాయ దుస్తులు ధరించారు. షేర్వాణీ, పగ్డి వేసుకున్నారు. తాప్సీ ఎరుపు రంగు దుస్తులు, బంగారు ఆభరణాలతో తళుక్కుమన్నారు.
#TaapseePannu looks adorable as she walks the aisle to marry #Mathias
The couple recently tied the knot in an intimate wedding pic.twitter.com/Lac8ZhN1PV
— KLAPBOARD (@klapboardpost) April 4, 2024