HomeTelugu Big Storiesపిచ్చి ప్రేమలో ఉన్నారేమో.. అందుకే తల పగలగొట్టాడు.. దర్శకుడికి తాప్సి కౌంటర్‌

పిచ్చి ప్రేమలో ఉన్నారేమో.. అందుకే తల పగలగొట్టాడు.. దర్శకుడికి తాప్సి కౌంటర్‌

4 15హీరోయిన్‌ తాప్సి .. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు తన కామెంట్‌తో చురకలంటించారు. సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్తకు సంబంధించిన ఓ ఆంగ్ల మీడియా ఆర్టికల్‌ను తాప్సి ట్యాగ్‌ చేస్తూ.. ‘అనుమానంతో తల పగలగొట్టాడా? బహుశా వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి ఆమెను చంపేశాడేమో’ అంటూ సందీప్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు తాప్సి.

ఆయన తెరకెక్కించిన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంలో షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ ఒకరిపై ఒకరు చేయిచేసుకుంటారు. దీని గురించి సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఓ మహిళతో ప్రేమలో ఉన్నప్పుడు అందులో చాలా నిజాయతీ ఉంటుంది. ఒకరిపై మరొకరు చేయి చేసుకునే స్వేచ్ఛ లేనప్పుడు అక్కడ ప్రేమ, ఎమోషన్‌ ఉంటుందని నేను అనుకోను. ఓ అబ్బాయి తన సొంతం అనుకున్న అమ్మాయిని ముట్టుకోలేనప్పుడు, కొట్టలేనప్పుడు ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదుస అన్నారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరలేపాయి. సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, మంచు లక్ష్మి తదితరులు సందీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాప్సి పై విధంగా ట్వీట్‌ చేయడంతో నెటిజన్లు గుర్రుమంటున్నారు. దీనిపై తాప్సి స్పందిస్తూ.. ‘హెచ్చరిక: హాస్యచతురత లేని వారు నా ట్వీట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu