HomeTelugu Trendingనెటిజన్‌ కామెంట్స్‌పై తాప్సీ స్ట్రాంగ్‌ రీప్లయ్‌

నెటిజన్‌ కామెంట్స్‌పై తాప్సీ స్ట్రాంగ్‌ రీప్లయ్‌

Taapsee pannu reply to netiతాప్సీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల తన చిత్రాలను ఆమె అభిమానులతో షేర్ చేసుకోగా, ఓ నెటిజన్ ఆమె నటనపై విమర్శలు గుప్పించాడు. తాప్సీకి అసలు నటనే రాదని ఆ వ్యక్తి కామెంట్ చేశాడు. “నువ్వో ఫాల్తూ హీరోయిన్‌వి. నువ్వు ఎత్తుకుని (ఎంచుకుని) సినిమాలు చేస్తుంటావు” అని వ్యాఖ్యానించాడు.

దీన్నిపై తాప్సీ ఘాటుగా స్పందించింది. “ఏం ఎత్తుకుని సినిమాలు చేస్తున్నాను. నా ఇమేజ్ ను పైకి ఎత్తుతున్నా. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు” అని తాప్సి స్ట్రాంగ్‌ రీప్లయ్‌ ఇచ్చింది. కాగా, 2016లో ‘పింక్’ చిత్రంలో నటించిన తరువాత బాలీవుడ్ ఆమెకు వరుస ఆఫర్‌లు వచ్చాయి‌. పలు విజయాలు ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu