టాలీవుడ్‌లో జుమ్మందినాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఆ తరవాత మారిన్నీ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ తెలుగులో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. కాగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ భారీ విజయాలను సాధించింది. అయితే తాప్సీ. ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలపై తాప్సి ఎప్పుడు స్పందించలేదు. కాని ఇప్పుడు తన బాయ్ ప్రెండ్‌విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. బ్యాడ్మింటన్ ఆటగాడైన మాథియాస్ బోతో ప్రేమలో ఉన్నానని తన కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేమకు అంగీకరించారని తెల్పింది. తన ప్రేమని తల్లిదండ్రులు అంగీకరించినందుకే అందరికీ చెప్పగల్గుతున్నానని లేదంటే ఇప్పటికీ మౌనంగానే ఉండాల్సి వచ్చేదంది. తన తల్లిదండ్రులు, సోదరీమణులు ఇష్టపడని వ్యక్తిని తాను అంగీకరించలేనని తాప్సీ చెప్పింది.