HomeTelugu NewsTaapsee Pannu: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్‌

Taapsee Pannu: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్‌

Taapsee Pannu got married secretly

Taapsee Pannu : హీరోయిన్ తాప్సీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోయింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగానే ఉంది. తాప్సీ గత పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ తో ప్రేమలో ఉంది.

కొన్నాళ్ల క్రితం తాప్సీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పుడు.. ఆమె నా పర్సనల్ విషయాలు బయటకి అనవసరం, ఒకవేళ నిజంగా అయితే నేనే చెప్తాను అని తెలిపింది. తాజాగా తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మథియాస్ బోయ్ తొ తాప్సీ వివాహం నిన్న ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే రెండు రోజుల క్రితమే ఈ పెళ్లి జరిగినట్టు సమాచారం.

Taapsee Pannu got married s

ఫస్ట్‌ నుంచి కూడా తాప్సీ తన ప్రేమని సీక్రెట్‌గానే ఉంచింది. తాప్సీ కి క్లోజ్ అయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు కనికా థిల్లాన్, పావైల్ గులాటి, అనురాగ్ కశ్యప్.. పలువురు ఈ పెళ్ళికి హాజరయినట్టు సమాచారం. కనికా, పావైల్ ఓ పెళ్ళికి హాజరైనట్టు ఫోటోలు షేర్ చేసారు కానీ అది ఎవరి పెళ్లి అనేది చెప్పలేదు. బాలీవుడ్ సమాచారం ప్రకారం తాప్సీ పెళ్ళికే వీరంతా వెళ్లినట్టు, మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఫోటోలు, వీడియోలు ఏవి బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మథియాస్ బోయ్ 2012 ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం కోచ్ గా పనిచేస్తున్నాడు. దీంతో తాప్సీకి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu