taapsee pannu : టాలీవుడ్‌లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. ఈ సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. ఇక్కడ ఛాన్స్‌లు తగ్గడంతో.. బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా అమ్మడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ ఎప్పుడు వాటిపై స్పందించలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది.
దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. ‘దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను.
అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.’ అని తాప్సీ చెప్పింది.