HomeTelugu TrendingAmbani Wedding: అంబానీల పెళ్లికి నేనెందుకు వెళ్తాను అంటున్న హీరోయిన్

Ambani Wedding: అంబానీల పెళ్లికి నేనెందుకు వెళ్తాను అంటున్న హీరోయిన్

Taapsee 's reason behind skipping Ambani Wedding
Taapsee ‘s reason behind skipping Ambani Wedding

Ambani Wedding:

టాలీవుడ్ లో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తాప్సి.. గత కొంతకాలంగా కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తోంది. కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ.. తనదైన శైలిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకుంది.

ఎలాంటి ఈ విషయమైనా ముక్కుసూటిగా జవాబు ఇవ్వడం తాప్సికి ఎప్పటినుండో అలవాటు. తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్లి గురించి కూడా రియాక్ట్ అయింది తాప్సి. ముఖేష్ అంబానీ ఇంటర్ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు అందరూ విచ్చేశారు. దాదాపు బాలీవుడ్ మొత్తానికి ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక లభించింది.

బాలీవుడ్ నుంచి పలు స్టార్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. కానీ తాప్సీ మాత్రం ఆహ్వానం అందినప్పటికీ అనంత్ అంబానీ పెళ్లికి హాజరవ్వలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాప్సీ దీని వెనుక కారణం చెప్పుకొచ్చింది.

“నాకు వాళ్ళు పర్సనల్ గా తెలియదు. నా వరకు పెళ్లి అనేది చాలా పర్సనల్ విషయం. వాళ్ల స్నేహితులు చాలా మంది ఉన్నారు. వాళ్లు పెళ్లికి వెళ్లి ఉంటారు. కానీ నాకు మాత్రం పెళ్ళికి వెళ్ళాలి అంటే.. ఆ ఫ్యామిలీతో ఏదో ఒక కమ్యూనికేషన్ అయినా ఉండాలి. పెళ్లి వాళ్ళకి, అతిధులకి ఏదో ఒక కమ్యూనికేషన్ ఉంటేనే పెళ్లికి వెళ్ళాలి అని నా అభిప్రాయం. అందుకే నేను వెళ్ళలేదు” అని చెప్పింది తాప్సి.

నిజానికి తాప్సి అన్నదాంట్లో తప్పేమీ లేదు. కానీ ఆమె కామెంట్ల విషయంలో మాత్రం నేటిజెన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఆమె అన్నది నిజమే అని, తెలియకుండా పెళ్లికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. మరికొందరు మాత్రం అంబానీ పెళ్లి అంటే అది ఒక హాయ్ ప్రొఫైల్ ఈవెంట్ అని అంటున్నారు.

పెళ్లికి వెళ్లిన అందరూ అంబానీలకి తెలిసిన వాళ్ళు కాదు.. కానీ ఆ వేడుక ద్వారా మరికొందరినీ కలుసుకోవచ్చు, నెట్వర్క్ పెంచుకోవచ్చు అని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే తాప్సీ కూడా వెళ్లి ఉంటే బాగుండేది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

నెట్వర్క్ అవసరం లేకపోయినా అంబానీ పెళ్లి కాబట్టి.. వెళ్లి కనీసం పెళ్లి ఎలా జరిగిందో చూసి.. ఫుడ్ తిని రావడానికి ఆయన వెళ్లి ఉండాల్సింది అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం తాప్సికి అసలు ఆహ్వాన పత్రిక లభించలేదు అని, తెలవని పేరంటానికి వెళ్లడం ఇష్టం లేక ఆగిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu