HomeTelugu Big Storiesనా లైంగిక జీవితం ఆసక్తికరంగా లేదు: తాప్సీ

నా లైంగిక జీవితం ఆసక్తికరంగా లేదు: తాప్సీ

Taapse pannu comments on ko
హీరోయిన్‌ తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. నిర్మాత కరణ్ జొహార్ ‘కాఫీ విత్ కరణ్’ పేరుతో సీజన్ 7 నిర్వహిస్తున్నారు. దీనికి జాన్వీకపూర్, విజయ్ దేవరకొండ, అనన్యపాండే సహా ఎంతో మంది ప్రముఖ నటీనటులు హాజరు కావడమే కాకుండా, ఎన్నో సంచలన విషయాలు బయటపెడుతున్నారు. దీంతో ఈ షో పట్ల ఆసక్తి పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో తాప్సీ నటించిన ‘దొబారా’ ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. సినిమా ప్రమోషన్ లో ఉన్న తాప్సీకి.. కాఫీ విత్ కరణ్ లో కనిపించకపోవడం గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి తాప్పీ స్పందిస్తూ.. కాఫీ విత్ కరణ్ కు ఆహ్వానించేంతగా నా లైంగిక జీవితం ఆసక్తికరంగా లేదు’ అని ఆమె బదులిచ్చి షాక్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కరణ్ జొహార్ తన షోలో పాల్గొనే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, లైంగిక జీవితం గురించి ప్రశ్నలు వేస్తూ రహస్యాలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న ఆమిర్ ఖాన్.. ప్రతి ఒక్కరి వ్యక్తిగత లైంగిక జీవితాల గురించి ప్రశ్నలు అడగడాన్ని తప్పుబట్టడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu