మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. వారం రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రద్దీ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసమే ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లేఖ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.