Swiggy Ban in AP:
Swiggy భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ప్రస్తుతం స్విగ్గీ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ హోటళ్లు, రెస్టారెంట్లు అక్టోబర్ 12 నుండి స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించాయి.
స్విగ్గీ తమకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడమే కారణంగా హోటల్స్ కంప్లైంట్ చేస్తున్నాయి. ఈ సమస్యతో రెస్టారెంట్లు, ఆహార కేంద్రాలు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయని హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు వివరించగా, చెల్లింపుల ఆలస్యంపై స్విగ్గీ, జొమాటోతో ముందు నుంచే చర్చలు జరిగినట్టు తెలిపారు.
జొమాటో రెస్టారెంట్ యజమానుల విధులు, నియమాలకు అంగీకరించినప్పటికీ, స్విగ్గీ మాత్రం వాటిని అమలు చేయలేకపోయింది. ఈ కారణంగా, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అక్టోబర్ 14 నుండి స్విగ్గీతో తమ వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ బహిష్కరణ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీ ఆహార డెలివరీ సేవలకు పెద్ద ప్రభావం పడవచ్చు. ఒక రాష్ట్రం కోల్పోతే.. స్విగ్గీ ఆదాయానికి, కస్టమర్ బేస్‌కి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో, స్విగ్గీపై ఆధారపడి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా అమ్మకాల తగ్గుదలతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మరి స్విగ్గీ సమస్యను త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందా లేదా అనేది చూడాలి.
Read More: Tollywood సెలబ్రిటీల మీద పగ పట్టిన పవర్ లేని రాజకీయ నాయకులు..