సినిమా ఇండస్ట్రీలో గాసిప్పులకు కొదవేమీ లేదు. రోజుకో వార్తా వస్తూనే ఉంటుంది. ఈ మధ్య
దక్షిణాది టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లిపై కూడా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఆమె
ఓ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతోందని అందరూ గుసగుసలాడుకొన్నారు. ఇప్పుడు
అదే మాదిరి మరో వార్త వినిపిస్తోంది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో ఆమె వివాహం ఉండబోతోందని
మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయంపై స్వీటి బాగా హర్ట్ అయింది. నా పెళ్లి మీడియాకు
పెద్ద జోక్ అయిపోయిందని తన సన్నిహితుల వద్ద వాపోతుందట. అంతేకాదు వరుస షెడ్యూల్స్
తో నేను బిజీగా ఉంటే మధ్యలో పెళ్లి చేసుకోవడానికి సమయం ఎక్కడుందని అంటోంది. గాసిప్స్
పై నాకు కోపం కాదు బాధ మాత్రమే అని వాపోతుంది. నిజమే.. అసలే సినిమాలతో బిజీబిజీగా
గడుపుతోంది స్వీటీ.. ఇలాంటి సమయంలో పెళ్లి రూమర్స్ రావడంతో అమ్మడు బాగా హర్ట్
అవుతోంది. ఇంట్లో కూడా పెళ్లికి ఇంకాస్త సమయం కావాలని పర్మిషన్ తీసుకుందట. కానీ
ఎట్టిపరిస్థితుల్లో 2017లో అనుష్క కు ఇంట్లో వారు పెళ్లి చేయడం ఖాయమని ఆమె సన్నిహితుల
ద్వారా తెలుస్తోంది!