కలర్స్ ప్రోగ్రాం తో ఏకంగా కలర్స్ స్వాతిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ మధ్యలో స్వాతి నిలవలేకపోతుంది. త్రిపుర సినిమాతో ప్రేక్షకులను బయపెట్టడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. పైగా ఆమె కాస్త లావుగా కనిపించిందనే విమర్శలు వచ్చాయి. దాంతో అప్పటి నుంచి గట్టి కసరత్తు చేస్తూ మళ్లీ స్లిమ్ అయ్యిందట. ప్రస్తుతం ఆమె ‘గుంటూర్ టాకీస్’ హీరో సిద్ధూతో ఒక సినిమా చేస్తోంది.
ఆ తరువాత మరో సినిమా చేయడానికి కూడా అంగీకరించింది. ‘అండవన్ కాట్టలై’ అనే తమిళ హిట్ చిత్రానికి ఇది రీమేక్ అని సమాచారం. ఈ సినిమా హీరోగా కొత్త అబ్బాయిని ఎంపిక చేశారు. హీరోయిన్ పాత్రకి గానూ స్వాతిని ఫైనల్ చేశారు. చిన్ని కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.