HomeTelugu Big StoriesSuzhal 2 Review: మొదటి సీజన్‌ను మించేలా ఉందా లేదా?

Suzhal 2 Review: మొదటి సీజన్‌ను మించేలా ఉందా లేదా?

Suzhal 2 Review: Is It Worth the Hype?
Suzhal 2 Review: Is It Worth the Hype?

Suzhal 2 Review OTT:

‘Suzhal The Vortex’ మొదటి సీజన్‌ మంచి ఆదరణ పొందిన తర్వాత, రెండో సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. Pushkar-Gayatri ఈ సీజన్‌ను మరింత బిగ్ స్కేల్‌లో తెరకెక్కించారు. ఓ హత్య కేసును ఆధారంగా చేసుకుని సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్, మళ్లీ ఒక ఉత్సవం నేపథ్యంలోనే జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే, Suzhal 2 మొదటి సీజన్‌ను మించిందా? లేక అదే ఫార్ములాలోనే కొనసాగిందా?

కథ:

నందిని (ఐశ్వర్యా రాజేష్) జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. ఆమెని విడుదల చేయించేందుకు న్యాయవాది చెల్లప్ప (లాల్) ప్రయత్నిస్తాడు. అయితే, అతను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం, కబర్డులో ఓ యువతి ముత్తు (గౌరీ కిషన్) గన్‌తో దొరకడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. దానితో, ఈ కేసులో మిగిలిన ఏడు అమ్మాయిలు కూడా తమ తప్పును ఒప్పుకోవడం మరింత మిస్టరీని పెంచుతుంది. అసలు అసలైన నిందితుడు ఎవరు? ఎందుకు చెల్లప్పను చంపారు? ఇదే Suzhal 2 కథానిక.

నటీనటులు:

Kathir మరోసారి SI Chakravarthy (సక్కరై) పాత్రలో మెప్పించాడు. అతని హావభావాలు, కేసును ఛేదించే తీరు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. Aishwarya Rajesh నందినిగా ఎమోషనల్‌ రోలర్‌కోస్టర్ ప్రయాణం చేస్తుంది. ఆమె పాత్ర ఈ సీజన్‌లో మెరుగ్గా రాశారు. Lal చిన్న రోల్‌ అయినా, కీలకంగా మారింది. Gouri Kishan తన పాత్రకు న్యాయం చేసింది.

సాంకేతిక అంశాలు:

పుష్కర్, గాయత్రీ టెంప్లేట్ మారని కథను గట్టి మేకింగ్తో ఆసక్తికరంగా మార్చారు. రియలిస్టిక్ విజువల్స్, గ్రామీణ నేపథ్యంలోనూ సింపుల్‌గా కాకుండా గ్రిప్పింగ్ ఫ్రేమ్స్‌తో తీర్చిదిద్దారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంచడంలో BGM కీలక పాత్ర పోషించింది. కొన్ని ఎపిసోడ్స్ కాస్త లాగ్ అనిపించాయి, కానీ క్లైమాక్స్ వరకు బాగానే హోల్డ్ చేసుకుంటాయి.

ప్లస్ పాయింట్స్:

*కొత్త సెట్టింగ్ – కోస్టల్ విలేజ్ థీమ్ ఇంట్రెస్టింగ్
*మిస్టరీను క్రమంగా అన్‌ఫోల్డ్‌ చేయడం
*కథనం లోనూ, కేరెక్టర్ల డెవలప్‌మెంట్‌లో ఇంప్రూవ్‌మెంట్
*విజువల్స్, బీజీఎమ్ హైలైట్

మైనస్ పాయింట్స్:

-కొన్ని చోట్ల ఊహించదగిన ట్విస్ట్‌లు
-ఫైనల్ రివీల్ అంతగా షాకింగ్‌గా అనిపించదు
-కథ అతి సులభంగా పరిష్కారం అవుతుందనే అనిపిస్తుంది

తీర్పు:

Suzhal 2, మొదటి సీజన్ ఫార్మాట్‌ను మెరుగుపరిచినప్పటికీ, పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. పలు ఆసక్తికరమైన మిస్టరీ మూమెంట్స్ ఉన్నప్పటికీ, కొంత హైప్‌ను అందుకోలేకపోయింది. అయితే, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఆస్వాదించే వారికి Suzhal 2 ఓకే ఓప్షన్.

రేటింగ్: 3.5/5

ALSO READ: Mythri Movie Makers నుండి ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu