కరోనా నిబంధనలకు విరుద్ధంగా ముంబైలో డ్రాగన్ ఫ్లై పబ్‌ను తెరవడంతో పోలీసులు దానిపై దాడులు చేసిన అందులో ఉన్న మాజీ క్రికెటర్ సురేష్ రైనాతో పాటు 35 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సన్నే ఖాన్ కూడా ఉందని ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందించింది. తాను సోమవారం రాత్రి ఓ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ డిన్నర్‌కు హాజరయ్యానని తెలిపింది. ముంబైలోని ఓ పబ్‌కు తాము వెళ్లామని చెప్పింది. తెల్లవారుజామున 2 గంటలు దాటాక కొందరు అధికారులు పబ్‌లోకి వచ్చి, అక్కడ కరోనా నియమనిబంధనలను పాటిస్తున్నారా? అన్న విషయాన్ని పరిశీలించారని చెప్పింది. ఆ సమయంలో అందులో ఉన్న వారందరినీ మూడు గంటలపాటు అక్కడే వేచి ఉండాలని చెప్పారని తెలిపింది. అనంతరం ఉదయం 6 గంటలకు తమను పంపించారని చెప్పింది. అంతేగానీ, తనను అరెస్ట్ చేయలేది, తన అరెస్ట్ గురించి వస్తోన్న వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది.