HomeTelugu Big Storiesకుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పిన సుష్మితా సేన్‌!

కుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పిన సుష్మితా సేన్‌!

Sushmita sen ends her relat
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌, ప్రముఖ మోడల్‌, నటుడు రోహ్మాన్‌ షాల్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లీవింగ్‌ రిలేషన్ కి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ విడిపోయిన నేపథ్యంలో రోహ్మన్‌ నేడు సుష్మిత ఇంటి నుంచి బయటకు వచ్చేసి తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాట్లు అంటున్నారు.

ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో బ్రేకప్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సుష్మిత. ‘ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్‌షిప్‌ ముగిసింది కానీ ప్రేమ మిగిలింది. ఐ లవ్‌ యూ గయ్స్‌’ అని రాసుకొచ్చింది. దీనికి రోహ్మాన్‌తో దిగిన ఫొటోను జత చేసింది. ఇక ఈ పోస్ట్‌పై రోహ్మన్‌ రియాక్ట్‌ అవుతూ ‘ఎల్లప్పుడూ అలాగే ఉందాం’ అని కామెంట్‌ చేశాడు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్‌తో మూడేళ్లుగా డేటింగ్‌ చేస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu