HomeTelugu Newsపెళ్లికి రెడీ అంటున్న సుస్మితా.. పిల్లలను మాత్రం దత్తత తీసుకుంటుందట!

పెళ్లికి రెడీ అంటున్న సుస్మితా.. పిల్లలను మాత్రం దత్తత తీసుకుంటుందట!

4 7బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ పెళ్లి పీటలెక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. కొంతకాలంగా సుస్మిత రోహ్‌మన్‌ షాల్‌ అనే మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నారు. తనతో ప్రేమలో ఉన్నట్లు సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. కొన్నివారాల క్రితమే పెళ్లి చేసుకుందామని రోహ్‌మన్‌.. సుస్మితను అడిగారట. ఇందుకు సుస్మిత కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది.

ఓ ఫ్యాషన్‌ కార్యక్రమంలో సుస్మిత, రోహ్‌మన్‌ కలిసి ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత సుస్మిత, రోహ్‌మన్‌ కలిసి పలు పార్టీలకు కలిసే హాజరయ్యేవారు. దీపావళి పండుగ నాడు సుస్మిత.. రోహ్‌మన్‌, తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. 2019లో వీరి వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుస్మిత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారు.

View this post on Instagram

#duggadugga ❤️

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu