మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్ది సినిమాలో ఒక్కో విషయం బయటకు వస్తున్నది. ఇప్పుడు ఆ సినిమాకు సంబందించిన ఎలాంటి చిన్న విషయం అయినప్పటికీ సోషల్ మీడియాలో హైలైట్ గా మారాయి. సినిమాకు హైప్ ను తీసుకొస్తున్నాయి. సైరా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ వారు ధరించిన దుస్తులని చెప్పొచ్చు. 1800 కాలంలో ఎలాంటి డ్రెస్ లు వేసుకునేవారు.. వారి హావభావాలు ఎలా ఉండేవి.. ఆభరణాలు ఎలాంటివి వాడేవారు అనే విషయాలపై సైరా కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత రీసెర్చ్ చేసి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు.
ఇందులో నయనతార, తమన్నా కోసం 12 అడుగుల చీరలను డిజైన్ చేశారు. బరువైన ఈ చీరలను ఎలా కట్టుకోవాలో కూడా సుష్మిత నేర్పించిందట. ఇదిలా ఉంటె, ఈ సినిమా కోసం సుష్మిత ప్రముఖ సెలెబ్రిటీ డిజైనర్ అంజు మోడీ సహకారం తీసుకున్నట్టు సుష్మిత తెలిపింది. అంజు మోడీ సహకారంతో అప్పటి కాలానికి సంబంధించిన డ్రెస్ లను డిజైన్ చేయడం ఈజీ అయ్యిందని చెప్పింది. రెండేళ్ల పాటు సినిమాకోసం పనిచేసినట్టు సుష్మిత పేర్కొన్నది. తమ కష్టానికి ప్రతిఫలం అక్టోబర్ 2వ తేదీన కనిస్తుందని సుష్మిత పేర్కొంది.