బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుష్మా స్వరాజ్ హఠాత్తుగా మరణించడంతో బీజేపీ షాక్ అయ్యింది. ఆమెకు బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు.
బీజేపీ నేతలతో పాటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఆమెకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాయి. సుష్మా స్వరాజ్ తన జీవితంలో ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న కోరిక నెరవేరిందని కన్నుమూసేముందు ట్వీట్ చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చిన ప్రధాని మోడీకి, రాజ్యసభలో చాకచక్యంగా బిల్లును ప్రవేశపెట్టి, బిల్ పాస్ అయ్యే విధంగా చూసిన హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్అవుతున్నది .
प्रधान मंत्री जी – आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji – Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019
गृह मंत्री श्री अमित शाह जी को उत्कृष्ट भाषण के लिए बहुत बहुत बधाई.
I congratulate the Home Minister Shri @AmitShah ji for his outstanding performance in Rajya Sabha.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 5, 2019