HomeTelugu Trendingఈ ఏడాదే సుశాంత్‌ సింగ్‌ వివాహం.. ఇంతలోనే ఇలా..

ఈ ఏడాదే సుశాంత్‌ సింగ్‌ వివాహం.. ఇంతలోనే ఇలా..

4 13
బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. వరుస విజయాలతో హీరోగా కొనసాగుతూ… ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న సుశాంత్ బలవన్మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సూసైడ్ చేసుకోవాల్సినంత బాధ అతనిలో ఏముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో సుశాంత్ వివాహం ఉన్నట్టు తెలిసింది. అతని వివాహానికి సన్నాహాలను కూడా ప్రారంభించారు. ఈ విషయాన్ని సుశాంత్ కు వరుసకు సోదరుడయ్యే పన్నా సింగ్ తెలిపాడు. సుశాంత్ కూడా పెళ్లి మూడ్ లో ఉన్నాడని… ఇంతలోనే ఇలా జరిగిందని చెప్పారు. అయితే ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, సుశాంత్ మరణంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా సుశాంత్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu