బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతిపై రోజుకో రకమైన అనుమానాలు బయటపడుతున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ స్నేహితుడు శామ్యూల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు కొన్ని అనుమానాలను లేవనెత్తుతోంది. సారా అలీఖాన్‌తో బ్రేకప్ కూడా సుశాంత్ డిప్రెషన్ కు ఓ కారణమని పోస్టు పెట్టాడు. కేదార్నాథ్ ప్రమోషన్స్ సమయంలో సుశాంత్, సారా అలీఖాన్ ప్రేమలో ఉన్నారని.. వారిద్దరిదీ విడదీయరాని బంధం అని తెలిపాడు. వారిది పూర్తిగా చిన్నపిల్లల మనస్తత్వం అని వారిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా గౌరవం అని తెలిపాడు. ఇలాంటి వారు ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారని తెలిపాడు. సుశాంత్ నటించిన సొంచిరియా సినిమా తర్వాత సుశాంత్‌కు సారా బ్రేకప్ చెప్పింది. మూవీ మాఫియా ఒత్తిడి వల్లే సుశాంత్ కు సారా దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉండొచ్చని తన పోస్టులో పేర్కొన్నాడు.